15 April, 2026 | 5:05 PM

క్యాతూరు పీహెచ్‌సీలో గర్భిణులకు పరీక్షలు

14-04-2026 01:29 AM

అలంపూర్, ఏప్రిల్ 13: అలంపూర్ మండల పరిధిలోని క్యాతూర్ ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో డాక్టర్ రాధిక ఆధ్వర్యంలో సోమవారం గర్భిణీ స్త్రీలకు పలు రకాల వైద్య పరీక్షలను నిర్వహించారు.గర్భిణీలకు రక్త నమూనాలను సేకరించి వాటి మెరుగైన ఫలితాల కోసం టీ హబ్ వెహికల్ ద్వారా జిల్లా కేంద్రానికి పంపించినట్లు ఆమె తెలిపారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఐరన్ క్యాల్షియం వంటి ట్యాబ్లెట్లను క్రమం తప్పకుండాగా వాడుతూ పోషక విలువలు కూడిన ఆహారం తీసుకోవాలని సూచించారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అంతేకాక గర్భిణీలు ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, మెడిటేషన్ వంటివి అవసరం మేరకే చేయాలని వాటిపై అవగాహన కల్పించారు. వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ప్రభుత్వ ఆసుపత్రిలోనే సాధారణ ప్రసవాలు అయ్యేందుకు వైద్య బృందం కృషి చేస్తుందని వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు చంద్రన్న, సత్యం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.