15 April, 2026 | 4:13 PM

సినిమా షూటింగ్‌లకు సంపూర్ణ సహకారం

14-04-2026 01:27 AM

నిర్మల్, ఏప్రిల్ ౧౩ (విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీతో పాటు ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడే సందేశాత్మక షూటింగ్లకు సంపూర్ణ సహకారం అందిస్తామని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తెలిపారు సోమవారం కొప్పుల క్రియేషన్స్ ఆధ్వర్యంలో ద ఎంప్టీ సీట్ చిత్రం ప్రారంభోత్సవ  కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ నిర్మల్ పట్టణం నుండి చలన చిత్ర నిర్మాతలు, దర్శకులుగా ఎదగడం హర్షనియమన్నారు.

పట్టణంలో కోటలు, బురుజులు, గొలుసుకట్టు చెరువులు ఎంతో ఆకట్టుకునే ప్రాంతమని ,జిల్లా నలుమూలల పర్యాటక ప్రాంతంగా బాసర సరస్వతి,కుంటాల జలపాతం, కవ్వాల్ అభయారణ్యం, గోదావరి సహియద్రి ప్రాంతాలు ఉన్నాయన్నారు. ఇక్కడి ప్రాంతాలను చలన చిత్రాల్లో చూయిస్తే ఈ ప్రాంతంతో పాటు, స్థానికులకు ఎంతో ఉపయోగ కరంగా ఉంటుందన్నారు. మొట్టమొదటి సారిగా దర్శకులు, నిర్మాతలుగా అడుగుబెడుతున్న ద్యాగ స్వామి, కొప్పుల చిన్నయ్యకు అభినందనలు తెలిపారు.