రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం
దమ్మపేట, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): శుక్రవారం వినాయక ఫంక్షన్ హాల్ నందు రోడ్డు భద్రతా ఉత్తవాల్లో భాగంగా ఇన్సెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐ.జి.) చంద్రశేఖర్ రెడ్డి, భద్రాద్రికొత్తగూడెం ఎస్.పి. రోహిత్ రాజ్ దమ్మపేట మండల ప్రజలతో వినాయక ఫంక్షన్ హాల్లో ప్రమాదాల నివారణపై అరైవ్, అలైవ్ కార్యక్రమంలో భాగంగా సమావేశం ఏర్పాటు చేశారని, ఈ సందర్భంగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తారని ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రజలు హాజరవ్వాలని ఎస్ ఐ సాయి కిషోర్ రెడ్డి కోరారు. సొసైటీలో ఇల్లిగల్ యాక్టివిటీస్ ఏమి జరిగినా ఉక్కుపాదంతో అణచివేస్తామని, డ్యూటీ విషయంలో తగ్గేదే లేదని తేల్చి చెప్పారు.
రాష్ట్రస్తాయి అధికారులు రోడ్డు యాక్సిడెంట్లు పై ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారంటే దాని ఇంపార్టెన్స్ ఏంటో అర్ధంచేసుకోవాలని, రాష్ట్ర స్థాయిలో దమ్మపేట మండలం యాక్సిడెంట్లలో టాప్ 10లో వుందని, మందలపల్లి నుండి గట్టుగూడెం వరకు యాక్సిడెంట్ జోన్లలో ఇండియాలో టాప్ 50లో వుందని తెలిపారు. మందలపల్లి నుండి ముష్టిబండ, మొద్దులగూడెం, గట్టుగూడెం వద్ద ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని తెలిపారు. దమ్మపేట మండలాన్ని యాక్సిడెంట్ రహిత జోన్ గా మార్చడమే తన లక్ష్యమని, మందలపల్లి నుండి గట్టుగూడెం వరకు ఇరువైపులా వున్న పిచ్చి చెట్లను తొలగిస్తున్నామని ఎస్ ఐ సాయి కిషోర్ రెడ్డి తెలిపారు.






