17 April, 2026 | 11:04 AM

డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె

17-04-2026 09:57 AM

దమ్మపేట, ఏప్రిల్ 17(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై గురువారం ఢిల్లీలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.  కేంద్ర స్థాయిలో రాష్ట్ర సమస్యలను సమర్థవంతంగా ప్రస్తావించడంలో ఆయన పాత్ర కీలకమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్, అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.