30 June, 2026 | 11:30 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ముసాయిదా ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

08-09-2025 06:25 PM

హనుమకొండ(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలో ముసాయిదా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలోని 12మండలాల్లో గ్రామపంచాయతీల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను ఇప్పటికే ప్రచురించడం జరిగిందని అన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా పై ఏవైనా  అభ్యంతరాలు ఉన్నట్లయితే రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలియజేయాలన్నారు. సోమవారం 12మండలాల్లో ఎంపీడీవోలు మండల స్థాయి లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

సమావేశానికి హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధులు  మండలాల్లో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే వాటి సమాచారాన్ని అందజేయాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల నుండి ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి 9వ తేదీన సవరించిన అనంతరం పదో తేదీన ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా  తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించడం జరుగుతుందని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయని, 12 మండల ప్రజా పరిషత్, 12 జిల్లా ప్రజా పరిషత్ లు ఉన్నాయి అని పేర్కొన్నారు. జిల్లాలో 370871 మంది ఓటర్లు ఉండగా, ఇందులో మహిళా ఓటర్లు 190201 ఉండగా, పురుష ఓటర్లు 180666, ఇతరులు,నలుగురు ఓటర్లు ఉన్నారని తెలియజేశారు. హనుమకొండ జిల్లాలో 631 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు వెల్లడించారు.