calender_icon.png 8 September, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకున్న జిల్లా స్థాయి టీఎల్ఎం మేళా

08-09-2025 06:21:35 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల అభ్యాస అనుభవాలను మెరుగుపరచడానికి జిల్లా విద్యాశాఖ మౌలిక భాషా గణిత సామర్ధ్యాల సాధన పేరుతో జిల్లా స్థాయి టీఎల్ఎం మేళాను  నిర్వహించింది. ప్రభుత్వ బాలికల పాఠశాల, లష్కర్ బజార్ లో ఏర్పాటుచేసిన ఈ మేళాను హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి డి. వాసంతి ప్రారంభించారు. ఈ మేళాలో 14 మండలాల నుండి వచ్చిన140 మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే సమయంలో ఉపయోగించే బోధనోపకరణములు సులభతరమైనటువంటి, ఆకర్షణీయమైన, సృజనాత్మకమైన వి తయారుచేసి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఏ విధంగా విద్యను బోధించాలో ప్రదర్శించారు. అందుబాటులో ఉన్న అట్ట ముక్కలు, చార్టులు, దినపత్రికలు, వేస్ట్ మెటీరియల్, తర్మోకోల్ షీట్లతో లో కాస్ట్ తో ఈ టి.ఎల్.ఎం సాధనాలను తయారు చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డిఈవో డి. వాసంతి మాట్లాడుతూ తరగతి గదిలో విద్యాబోధన చేస్తున్నప్పుడు టీ.ఎల్.ఎం సామాగ్రి అత్యంత అవసరమన్నారు. రెడీమేడ్ గా తయారు చేసిన టిఎల్ఎం కాకుండా ఉపాధ్యాయులు సొంతగా తయారుచేసిన టి.ఎల్.ఎం లను తరగతి గదిలో ఉపయోగిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి మేళాకు వచ్చిన టిఎల్ఎంలు చాలా నాణ్యతతో ఉన్నాయన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన టి.ఎల్.ఎం లను ఉపాధ్యాయులు మరింత సృజనాత్మకత జోడించి తయారు చేసి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. మౌలిక భాషా గణిత సామర్ధ్యాల సాధన హనుమకొండ జిల్లా స్థాయి టిఎల్ఎంల మేళా నుండి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో మూడు, గణితంలో రెండు, ఈవీఎస్ లో ఒకటి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి.

తెలుగు టిఎల్ఎంలో బహుళకృత్యం కే. రమాదేవి, ఎంపీపీఎస్,పాలకుర్తి, దామర, ఇంగ్లీషులో మల్టీపర్పస్ గ్రిడ్ వి.శ్యాంసుందర్, ఎంపీ యుపిఎస్, తక్కల్లపాడు, దామెర, మరియు  మై ఇంగ్లీష్ వరల్డ్ బి.కవిత, ఎంపీ యుపిఎస్, మునిపల్లి, హసన్ పర్తి, గణితంలో జాయ్ ఫుల్ మ్యాథ్స్ కే . కవిత, ఎంపీ యుపిఎస్ ,పులిగిల్ల, నడికుడ, గణితంలో మ్యాథ్స్ విత్ బాంబు స్టిక్ టి .అశోక్ , ఎంపీపీ ఎస్ , వరి కోల్, నడికుడ, ఈవీఎస్ లో  పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎయిర్ ప్రెషర్, పి, చంద్రయ్య, ఎంపీపీ ఎస్ కోతుల నడుమ, ఎలుకతుర్తిఎంపికయ్యారు. ఈ సందర్భంగా లష్కర్ బజార్ బాలికల పాఠశాల విద్యార్థినులు చేసిన నృత్యాలు ఉపాధ్యాయులను ఆకర్షించాయి.