6 July, 2026 | 7:58 PM

రేపు అచ్చంపేట పబ్లిక్ క్లబ్‌లో మెగా కంటి వైద్య శిబిరం

06-07-2026 07:17 PM

తెల్ల రేషన్ కార్డు దారులకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు

అచ్చంపేట,(విజయక్రాంతి): అచ్చంపేట పబ్లిక్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి మాక్స్ విజన్ ఐ హాస్పిటల్ (ఈహెచ్ఎస్) సహకారంతో   మంగళవారం ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరం నిర్వహించనున్నట్లు పబ్లిక్ క్లబ్ అచ్చంపేట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అంగిరేకుల బిక్షపతి, తనూజ్ మనోహర్ ప్రసాద్ పటేల్  తెలిపారు. శిబిరంలో ప్రముఖ నేత్ర వైద్యుల బృందం కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్య సలహాలు అందించనుంది. కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ప్రత్యేకంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి కంటి శస్త్రచికిత్స ఉచితంగా చేస్తామని  తెలిపారు. ఉచిత కంటి వైద్య శిబిరం సేవలను నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.