6 July, 2026 | 7:52 PM

కాంగ్రెస్ సీనియర్ నాయకుడి కుటుంబానికి ఆర్థిక సాయం

06-07-2026 07:20 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దాకని బాల్ రాజు సోమవారం మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తక్షణ అవసరాల కోసం ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. మృతుడి కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని నాయకులు భరోసా ఇచ్చారు.