12 July, 2026 | 3:42 PM

Breaking News

విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •  

రేపు మెగా జాబ్ ఫెయిర్

22-04-2025 02:05 AM
  1. సద్వినియోగం చేసుకోవాలని

ప్రముఖ సామాజికవేత్త 

సిద్దు రెడ్డి కందకట్ల విజ్ఞప్తి

రాజేంద్రనగర్ ఏప్రిల్21: మెగా జాబ్ ఫెయిర్ ను సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ సామాజికవేత్త సిద్దు రెడ్డి కందకట్ల విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన ఒక ప్రకటన లో వివరాలు వెల్లడించారు. బుధవారం శంషాబాద్ పట్టణంలోని ఎయిర్పోర్ట్ రోడ్డులో ఉన్న  రాజ్ మహల్ ఫంక్షన్ హాల్ లో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో 100కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని ఆయన పేర్కొన్నారు. అమెజాన్, జిఎంఆర్ తదితర పెద్ద కంపెనీలు పాల్గొంటాయని వివరించారు.  బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు తెలియజేశారు.

21 వేలకు పైగా ఉద్యోగాలు అందుబాటులోఉన్నాయన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సామాజికవేత్త సిద్దు రెడ్డి కందకట్ల విజ్ఞప్తి చేశారు.