28 August, 2026 | 1:58 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి

12-07-2026 02:07 PM

ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఆదిత్య

సిద్దిపేట,(విజయక్రాంతి): విద్యా సంస్థల సమస్యలు పరిష్కారం కొరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ నెల 14న నిర్వహించ తలపెట్టిన కాళశాలల బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబెర్ ఆదిత్య పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం లో ఇప్పటి వరకు 12 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని మండిపడ్డారు.

దాదాపు 20 లక్షల పెద విద్యార్థుల జీవితాలు, చదువులు రియంబర్మెంట్ తో ముడిపడి ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఫీజు బకాయిలు లేకుండా చేస్తామన్న చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ పడుకున్నావని ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా బంద్ కు సంబందించిన వాల్ పోస్టర్ ని విడుదల చేశారు.కళాశాలల బంద్ కార్యక్రమానికి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యాజమాన్యాలు అందరూ సహకరించాలని కోరారు.