12 July, 2026 | 2:44 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.

12-07-2026 02:11 PM

ప్రజల చిరకాల కలను సాకారం చేసిన ప్రజా ప్రభుత్వం.

శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం.

చిట్యాల,(విజయక్రాంతి): దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. రూ.339.59 కోట్ల వ్యయంతో హైబ్రిడ్ అన్యుటీ మోడల్ (హమ్) విధానంలో భువనగిరి నుంచి చిట్యాల వరకు రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించే నిర్మాణ పనులకు రామన్నపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టుకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అభివృద్ధి దిశగా కీలక అడుగని పేర్కొన్నారు. ఈ రహదారి పూర్తయితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో పాటు రహదారి భద్రత మెరుగుపడుతుందని, రవాణా సౌకర్యాలు విస్తరించి ప్రాంతీయ వాణిజ్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు కొత్త ఊపు లభిస్తుందని తెలిపారు.

ఈ ప్రాజెక్టు ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా అభివృద్ధికి మరింత వేగం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.