మంత్రి శ్రీధర్ బాబుకు బోయిన్ పేట్ సమస్యలపై వినతిపత్రం
16-05-2026 01:52 PM
మంత్రి శ్రీధర్ బాబు కు బోయిన్ పేట్ సమస్యలపై వినతి పత్రం అందించిన కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి
మంథని, మే 16 (విజయ క్రాంతి): హైదరాబాద్ లోని మినిస్టర్ కార్యాలయంలో ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ను బోయిన్ పేట్ వివిద సమస్యలపై బోయిన్ పేట్ 6వ వార్డ్ ఇండిపెండెంట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి.. సమస్యలపై శనివారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించి వెంటనే సమస్యలు పరిష్కారిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు కు కౌన్సిలర్ శ్రీలతక్రాం కృతజ్ఞతలు తెలిపారు.






