నేడు తహసీల్దార్లకు వినతిపత్రాల అందజేత
17-04-2026 01:58 AM
టీజీఈ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ రాజశేఖర్
హైదరాబాద్, ఏప్రిల్ 16(విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకై టీజీఈ జేఏసీ ప్రకటించిన కార్యాచరణలో భాగంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తం గా మండల తహసీల్దార్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేస్తామని జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి సరికాదన్నారు. ప్రభుత్వ జాప్యం కారణంగా రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులతో పాటు సర్వీసులో ఉన్న ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బం దులు పడుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో తమ సమస్యలను పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందన్నారు.






