07-12-2025 01:30:33 AM
మూడు వేలకు పైగా విద్యార్థుల కళాఖండాల ఆవిష్కరణ
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): మియాపూర్‌లోని మేరు ఇంటర్నేష నల్ స్కూల్ వార్షిక కళా ప్రదర్శన ‘మేరు అంతర్గని 2025’ను వైభవంగా నిర్వహించింది. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు రూపొందించిన 3,000 కు పైగా పెయింటింగ్స్, స్కల్ప్చర్స్, థీమ్ ఆధారిత ఇన్స్టాలేషన్లు ఈ ఎగ్జిబిషన్ను ప్రత్యేకంగా నిలిపాయి. ఈ కార్యక్రమాన్ని ప్రసిద్ధ కళాకారుడు ఎం. వి. రమణ రెడ్డి ప్రారంభించారు.
మేరు ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థా పకురాలు మేఘన గోరుకంటి జూపల్లి, యశోదా హాస్పిటల్స్ సహవ్యవస్థాపకులు దేవేందర్ రావు గోరుకంటి, ప్రముఖ డిజైనర్ ఐశ్వర్య రావు గోరుకంటి పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ ఏడాది ప్రదర్శనకు ‘ఓపెన్ థీమ్’ను ఎంచుకోవడం వల్ల విద్యార్థులు స్వేచ్ఛగా పద్ధతులు, టెక్స్చర్లు, రంగులు, భావాలు, వీక్షణ కోణాలను అన్వేషించగలిగారు.
అబ్స్ట్రాక్ట్ నుండి హైపర్-రియలిజం వరకు, నగర దృశ్యాల నుండి లోతైన భావ వ్యక్తీకరణల వరకు విభిన్న కళాఖండాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ప్రధానంగా టైమ్‌లైన్స్ ఆఫ్ ఇమేజినేషన్ అనేది 220 స్కూల్ రోజుల అనుభవాలను గడియారాల రూపం లో చూపిన వినూత్న సృష్టి. అలాగే వీఆర్ ఆర్‌డివైన్.. రోజువారీ నిర్ణయాలు జీవితాన్ని ఎలా మలుస్తాయో గుర్తుచేసే ధ్యానాత్మక కళ. ఫుడ్ ఫర్ ద మోడ్రన్ వరల్డ్- చెక్కిన అక్షరాలను ధాన్యాల్లా అమర్చి రైతులకు నివాళి అర్పించే భావనాత్మక ప్రయత్నం.
వింగ్స్ ఆఫ్ వండర్- పేపియర్-ûాషేలో రూపొందించిన లైఫ్-సైజ్ పెగసస్ అపార ఊహాశక్తికి చిహ్నం. వ్యవస్థాపకురాలు మేఘన గోరుకంటి జూపల్లి మాట్లాడుతూ.. అంతర్గని మా విద్యార్థుల ఊహ, ధైర్యం, లోతైన కళాత్మకతకు ప్రతిబింబం. ప్రతి విద్యార్థి స్వీయ వ్యక్తీకరణకు ప్రేరణ పొందే వాతావరణాన్ని మెరూ నిర్మిస్తోంది అని తెలిపారు. రమణ రెడ్డి విద్యార్థుల ఒరిజినాలిటీ, ధైర్యమైన ప్రయోగాలు, థీమాటిక్ ఎక్స్ప్రెషన్ను ప్రశంసించారు.