calender_icon.png 7 December, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి

07-12-2025 01:28:50 AM

10న బీసీల ఛలో ఢిల్లీ

వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు కాంగ్రెస్ పార్టీపై నిరసన వ్యక్తం చేయడానికి ఈనెల 10న చలో ఢిల్లీ చేపడుతున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఈ మేరకు శనివారం విద్యానగర్ బీసీ భవన్‌లో సంఘం జాతీయ సెక్రెటరీ బాణా ల అజయ్ కుమార్ నేతృతంలో జరిగిన సమావేశంలో ఛలో ఢిల్లీ పోస్టర్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యంలతో కలిసి ఆర్. కృష్ణయ్య ఆవిష్కరించారు.

అనంతరం ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల బీసీల ఆత్మగౌరవం హక్కుల సాధన కోసం చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాలుగా నష్టపోతున్న బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. జనాభా అత్యధికంగా ఉన్న బడ్జెట్ మాత్రం నామమా త్రంగా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే రెండు లక్షల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

అలానే బీసీ ఉద్యోగులకు ప్రమోషన్‌లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బాణాల అజయ్ కుమార్ అధ్యక్షతన ఈ నెల10న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగే ఓబిసి సెమినార్‌కు విజయవంతం చేయాలని విద్యార్థి సంఘం జాతీ య సెక్రెటరీ బాణాల రేష్రీత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మల వీరన్న, బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ రాందేవ్ మోడీ, టి. రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.