27 June, 2026 | 7:28 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

ఏడు నెలల్లో లక్ష కొలువులు ఊస్ట్

07-08-2024 02:53 AM

టెక్ రంగంలో ఆగని లే ఆఫ్‌లు

జూలైలో 8 వేల మంది తొలగింపు

న్యూఢిల్లీ, ఆగస్టు 6: ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో టెక్ కంపెనీల్లో ఉద్యోగులు తొలగింపు మరింత తీవ్రం అవుతున్నది. ఈ ఏడాది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో 124,517 మంది ఉద్యోగులను ఇంటికి పంపినట్టు నివేదికలు వెల్లడించాయి. జూలై నెలలో 34 టెక్ సంస్థల్లో 8000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు.

భారత్‌లో పలు స్టార్టప్ కంపెనీలకు పెట్టుబడులు ముఖం చాటేయటంతో విధిలేక ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి. సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ‘కూ’ ఏకంగా మూతపడింది. ఇందులో పనిచేసే 200 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. కెర్స్‌పెర్స్‌కీ 50, రేషామండి 400 (80 శాతం), అన్‌అకాడమీ 250, వేకూల్ 200, పాకెట్ ఎఫ్‌ఎం 200, బంగీ 220, హంబుల్ గేమ్స్ 36 (100 శాతం) ఉద్యోగులను తొలగించాయి.