కొత్తగూడెంలో స్వల్ప భూకంపం
15-06-2026 01:55 AM
- అర్ధరాత్రి బయటకు పరుగులు తీసిన జనాలు
- రిక్టర్ స్కేల్‌పై 3.8గా నమోదు
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 14 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు మండలాల్లో ఆదివారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. పాల్వంచ, బూర్గంపాడు, భద్రాచలం మండలాల్లో ఆదివారం తెల్లవారుజామున 2. 30 నిమిషాలకు భూమి కనిపించినట్లు స్థానికుల తెలిపారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.8గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రకంపనాలు కొన్ని సెకన్లు మాత్రమే ఉండటంతో ప్రజలు భయంతోనే బయటకు పరుగులు తీశారు. జిల్లాలో పలుచోట్ల భూమి స్వల్పంగా కనిపించినప్పటికీ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు.






