ఆ ఆడియో నాది కాదు.. నకిలీది
కాంగ్రెస్‌ను బలహీనపరిచే కుట్ర
మహేశ్‌కుమార్‌గౌడ్ నాకు తమ్ముడు
క్రమశిక్షణ కమిటీకి షబ్బీర్ అలీ వివరణ
కామారెడ్డి, జూన్ 14 (విజయక్రాంతి): ఇటీవల సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ స్పందించారు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ పంపిన నోటీసుకు ఆదివారం వివరణ ఇ చ్చారు. ఆ ఆడియో క్లిప్ నకిలీదని, కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనే ఉద్దేశంతో కొందరు ప్లాన్ తో కుట్రలకు తెర లేపారని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తనకు తమ్ముడిలాంటి వాడన్నారు. సమాజంలో, పార్టీలో ఉన్న తన ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారన్నారు.
త్వరలోనే కుట్రదారులను బయటపెడతామన్నారు. ఎక్కడా కూడా తాను మహేశ్‌గౌడ్ గురించి తప్పుగా మాట్లాడలేదని వివరించారు. తమ ఇద్దరి మధ్య దూరం పెంచేందుకే కుట్ర ప న్నారని అన్నారు. క్రమశిక్షణ కమిటీ వివరణ కోరకముందే తనై జరుగుతున్న దుష్ప్ర చారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు షబ్బీర్ అలీ వివరించారు. తాను 45 ఏళ్లుగా కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని, పార్టీకి నష్టం కలిగించే పని ప్రాణం పోయే వరకు చేయనని స్పష్టం చేశారు.






