15 June, 2026 | 2:33 AM

బాసర ట్రిపుల్ ఐటీ అల్పాహారంలో బొద్దింక

15-06-2026 01:57 AM

ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు

చర్యలు తీసుకుంటానన్న వైస్ ఛాన్సలర్

నిర్మల్, జూన్ 14 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అందించే అల్పాహారంలో బొ ద్దింక ఉండడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ-1, ఈ-2 శక్తిలో ఉదయం విద్యార్థులకు అల్పాహారం కోసం ఆలూకుర్మా తయారు చేశారు.

ఆలుకుర్మాలో బొద్ధింక చనిపోయి ఉండడంతో ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి మెస్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సీజన్‌లో విద్యార్థులు వడ్డించే భోజనంలో కల్తీ జరిగి విద్యార్థులు అస్వస్థతకు గురికాగా తాజాగా అల్పాహారంలో బొద్దింకలు, పురుగులు వస్తున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకురాగా చర్యలు తీసుకుంటానని తెలిపినట్టు విద్యార్థి సంఘం నాయకులు పేర్కొన్నారు.