2 April, 2026 | 3:17 AM

ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం

02-04-2026 12:00 AM

సూర్యాపేట, ఏప్రిల్ 1 :  కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు రక్షణ లభిస్తుందని సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు నూకల సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కోర్టు సముదాయంలో సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి షఫీ ఉల్లా తో కలిసి మార్చి 30న కాంగ్రెస్ ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్షన్ ఆక్ట్ ను అమలుపరిచిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35వేల మంది న్యాయవాదులలో 100 మంది వివిధ రకాల కక్షలు కార్పన్యాలు వివాదాల ద్వారా భౌతికదారులకు పాల్పడడం, చంపబడినట్లు పేర్కొన్నారు. కక్షిదారుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే న్యాయవాదులపై  కేసులు పెట్టడం భౌతిక బాడులకు పాల్పడి అంతమొందించడం సమంజసం కాదని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో ప్రతి ఒక్క న్యాయవాది కుటుంబాల రక్షణ కోసం చట్టం చేసిన అందరం ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. మునిసిపల్ వైస్ చైర్ పర్సన్ ఎండి షఫీ ఉల్లా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో సబ్బండ వర్గాలు ప్రశాంత జీవనం కొనసాగించే వెసులుబాటు ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపించారని,

తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల పరిరక్షణ కోసం కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు టేకులపల్లి శ్రీనివాసరావు, వసంత సత్యనారాయణ పిళ్లయ్ యాదవ్, కోణం రఘురామయ్య, నరసయ్య, ఫరుద్దీన్ అహ్మద్, సీనేపల్లి సోమేశ్వర్, నరేష్ పిళ్ళేయ్, మోదుగు నాగిరెడ్డి,దొరేపల్లి రమేష్, బొమ్మ గాని శ్రీనివాస్ గౌడ్, వాంకుడోత్ రవి, పసల బాలరాజు, సరిత, పల్లా పరమేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.