కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా? అనేదే బీఆర్ఎస్ ఆలోచన
కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులకు సమస్యలు వచ్చాయా?
హైదరాబాద్: కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులకు ఎప్పుడైనా సమస్యలు వచ్చాయా? అని సీఎల్పీ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adhikari laxman) నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రశ్నించారు. ప్రజలు సంతోషంగా ఉండాలనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఎప్పుడు కూలిపోతుందా అనేదే బీఆర్ఎస్ ఆలోచనని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులకు ఇప్పటి వరకు ఒక్క పగులు కూడా రాలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు తుమ్మిడిహట్టి వద్ద రూ 15 వేలకోట్ల పనులు పూర్తయ్యాయని వివరించారు. జైపూర్ చెరువు నుంచి శ్రీపాదఎల్లంపల్లికి నేరుగా నీళ్లు వదలొచ్చని తెలిపారు. లిఫ్ట్ పెట్టి నీళ్లు వదిలితే మిషన్లు కొనొచ్చు.. కమీషన్లు తీసుకోవచ్చు అనేదే బీఆర్ఎస్ ఆలోచనని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ పెడితే బీఆర్ఎస్ నాయులు ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు.






