31 July, 2026 | 3:59 PM

శక్తి డిపార్టుమెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

31-07-2026 02:51 PM

హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధి (శక్తి) డిపార్టుమెంట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి వివేక్ వెంకటస్వామి, అధికారులు  పాల్గొన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణలకు అవసరమైన రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కంపెనీల్లో ఇంటర్న్ షిప్ అవకాశం కల్పించాలని సూచించారు.

ఏటీసీ ల్లో EV సర్వీసులకు సంబంధించిన కోర్సులు, డ్రోన్ టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టాలని దిశానిర్దేశం చేశారు. TOMCOMని మరింత బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్ పాస్‌పోర్టు మొదలు విదేశీ కంపెనీల్లో ఉద్యోగాల వరకు TOMCOM బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. స్కిల్ యూనివర్సిటీ లో విదేశీ భాషలు నేర్పేందుకు ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలని, డిమాండ్ కు తగినట్లు నర్సింగ్ కళాశాలలకు అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.