ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకేనా!
చేర్యాల ఎంపీడీఓ కు వినతిపత్రం అందజేత
చేర్యాల, జులై 31: ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అక్రమాలు జరిగాయని చేర్యాల మండలంలోని పాతదోమ్మాట గ్రామస్తులు ఆరోపించారు.గురువారం చేర్యాల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓకు వినతిపత్రం అందజేసి వారు మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుండగా, గ్రామానికి రెండవ విడతలో ఏడు ఇండ్లు మంజూరయ్యాయని అందులో ఆర్థికంగా బలపడిన నలుగురు గుజ్జుల సంధ్య, వంకాయల లక్ష్మీ, ముచ్చెంతుల అమృతవ్వ, దప్పు శాంతమ్మ లకు వ్యవసాయ భూములు, స్థిరాస్తులు ఉన్నాయని అన్నారు.గ్రామంలో ఎంతోమంది నిరుపేదలు ఉండగా అనర్హులను ఎంపిక చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే ఉన్నతాధికారులు విచారణ జరిపి ఆ నాలుగురికి మంజూరు చేసిన ఇండ్లను రద్దు చేయాలని, గ్రామసభ ద్వారా అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తిరుపతి భాస్కర్ లత, చంద్రం,శేఖర్, నర్సింలు తదితరులు ఉన్నారు.






