జీవన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్: అస్వస్థతకు గురై సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డిని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Lakshman) పరామర్శించారు. జీవన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని లక్ష్మణ్ వైద్యులకు సూచించారు. జీవన్ రెడ్డి(Jeevan Reddy) త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఫుడ్ పాయిజనింగ్(Jeevan Reddy Food Poisoning) కారణంగా అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో ఆహారం తీసుకున్న జీవన్ రెడ్డికి గురువారం రాత్రి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను సికింద్రాబాద్ నగరంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.






