calender_icon.png 9 December, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయికి అనేకమంది

09-12-2025 12:18:22 PM

ఆర్థిక సమస్యలు లేకుండా చూడాలి: మంత్రి అజారుద్దీన్

హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) కొనసాగుతోంది. హాల్-2లో తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ అంశంపై చర్చ జరిగింది. చర్చలో గోపీచంద్, పీవీ సింధు, గుత్తా జ్వాలా, కావ్యమారన్, అంబటి రాయుడు  పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కోచింగ్ పై చర్చించారు. తెలంగాణ నుంచి అనేక మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి వెళ్లారని మైనార్టీల సంక్షేమం, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖల మంత్రి అజారుద్దీన్ అన్నారు. గోపీచంద్ అకాడమీ నుంచి అనేక మంది వచ్చారని తెలిపారు. క్రీడాభివృద్ధిలో మైదానాల పాత్ర చాలా కీలకమని అజారుద్దీన్  వెల్లడించారు. ఫుట్ బాల్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. పీవీ సింధు, సైనా నెహ్వాల్, గుత్తా జ్వాల మంచి పేరు తెచ్చుకున్నారని మంత్రి కొనియాడారు. క్రీడాకారులకు ఆర్థిక సమస్యలు లేకుండా చూడాలని కోరారు. క్రీడా పాలసీతో అనేక ఉపయోగాలు ఉన్నాయని వివరించారు. క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి అండదండలు అవసరం అన్నారు. క్రీడాకారులకు ఆర్థిక సాయం చేయాలి.. మంచి ఉద్యోగం ఇవ్వాలని మంత్రి అజారుద్దీన్ కోరారు.