09-12-2025 11:57:31 AM
హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) కొనసాగుతోంది. గ్లోబల్ సమ్మిట్ లో ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్(Olympic Gold Quest) అంశంపై చర్చ జరిగింది. చర్చలో కుంబ్లే, గోపీచంద్, పీవీ సింధు, గుత్తా జ్వాల, అంబటి రాయుడు పాల్గొన్నారు. క్రీడాకారుల విజయానికి అనేక అంశాలు దోహదం చేస్తాయని పీవీ సింధు(PV Sindhu) తెలిపారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, కోచ్ లు చాలా కీలకం అన్నారు. క్రీడాకారులకు ప్రతి దశలో ప్రోత్సాహం చాలా అవసరమని సింధు చెప్పారు.