09-12-2025 12:33:33 PM
హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) తొలి సెషన్ లో జీనోమ్ వ్యాలీ, లైఫ్ సైన్సెస్ అంశంపై చర్చ జరిగింది. జోనోమ్ వ్యాలీ, లైఫ్ సైన్సెస్ చర్చలో మంత్రి శ్రీధర్ బాబు, లారస్ ల్యాబ్స్ ప్రతినిధి చావా సత్యనారాయణ, అరబిందో ఫార్మా డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ ది కీలక పాత్ర అని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఫార్మా రంగం మరింత విస్తరిస్తోందని సూచించారు. జోనోమ్ వ్యాలీ ప్రారంభమై 25 ఏళ్లు అయిందని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ 25 ఏళ్లలో హైదరాబాద్ ఎంతో మారిందన్నారు.