17 June, 2026 | 8:43 PM

Breaking News

ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •  

నూతన పాలకమండలిని సన్మానించిన మంత్రి

17-02-2026 12:00 AM

సంగారెడ్డి, ఫిబ్రవరి 16(విజయక్రాంతి): ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ నూతన చైర్మన్ గా ఎన్నికైన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ గా సత్యనారాయణ (చిట్టిబాబు), కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను పదవి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సన్మానించారు. జోగిపేటలో మంత్రిని కలసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలను అందించాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సామాన్యుడికి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేరేలా మున్సిపల్ కౌన్సిలర్ సభ్యులు కృషి చేయాలని మంత్రి సూచించారు.