తాలు, తరుగు పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు: మంత్రి జూపల్లి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో(Nagarkurnool District) రైస్ మిల్లుల ఆకస్మిక తనిఖీల సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) మిల్లర్లకు హెచ్చరిక జారీ చేశారు. తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
జిల్లా కేంద్రంలోని సత్యసాయి రైస్ మిల్లు, చందుబట్ల మండలంలోని శ్రీ వెంకటేశ్వర అగ్రో ఇండస్ట్రీస్‌ను పరిశీలించిన మంత్రి, ధాన్యం అన్‌లోడింగ్‌లో(Grain Unloading) జరుగుతున్న ఆలస్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుల తరబడి లారీలను నిలిపివేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పెరగకుండా వెంటనే మిల్లులకు తరలించి అన్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం కలిగించే వారిని ఉపేక్షించబోమని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.






