calender_icon.png 7 February, 2026 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీకి ఓటు.. అభివృద్ధికి బాట

06-02-2026 09:02:51 PM

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

షాద్ నగర్ లో  కార్నర్ మీటింగ్ లలో ఎన్నికల ప్రచారం

భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు అభ్యర్థన

షాద్‌నగర్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిని గెలిపించి అభివృద్ధికి బాట వేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డుల్లో కార్నర్ మీటింగ్ లలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు కేంద్ర స్థాయి నుండి గ్రామీణ స్థాయి వరకు పథకాలు అమలవుతున్నాయని తెలిపారు గ్రామాల అభివృద్ధితోపాటు పట్టణాలను సుందరీకరించేందుకు ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో బిజెపి నాయకులు శ్రీ వర్ధన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.