యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి
తెలంగాణ బిడ్డ ఒలింపిక్స్ స్థాయికి ఎదిగే విధంగా కార్యాచరణ
క్రీడల కోసం పాలమూరుకు మరో రూ. 100 కోట్లు
మహబూబ్ నగర్: తెలంగాణ బిడ్డ ఒలింపిక్స్ స్థాయికి ఎదిగే విధంగా కార్యాచరణ చేపట్టామని మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వాకిటి శ్రీహరి పర్యటించారు. 400 మీటర్లు, 8 లైన్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్(Synthetic athletic track) ఏర్పాటుకు మంత్రి వాకిటి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... మహబూబ్ నగర్ స్టేడియానికి రూ. 12 కోట్లు మంజురయ్యాయని తెలిపారు. యువత అవకాశాలను వినియోగించుకుని పాలమూరు గడ్డకు పేరు తేవాలని సూచించారు. ఆటతోనే ప్రపంచానికి చూపించాలనుకున్న వారికే ఆట వస్తుందని వివరించారు.
మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఉన్నందుకు జిల్లాకు ఎక్కువ నిధులు కేటాయించినట్లు తెలిపారు. క్రీడల కోసం మరో రూ. 100 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. విద్యార్థులను ఏ స్థాయిలోనైనా ఆడించే శక్తి పాలమూరు జిల్లాకు వచ్చిందన్నారు. ఎమ్మెల్యేల ప్రతిపాదనలపై గ్రీన్ ఛానెల్ లో రెవెన్యూ స్థలాలు క్లియర్ చేసి కలెక్టర్లకు ఇవ్వాలని ఆదేశించారు.






