22 June, 2026 | 1:42 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది

22-06-2026 12:39 PM

బోథ్, జూన్ 22 (విజయక్రాంతి): అధికంగా వర్షాలు కురుస్తాయని మండలంలోని అనేక గ్రామాలలో రైతులు పత్తి విత్తనాలు నాటేందుకు తమ తమ చేలలో గట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో వర్షాలు కురిస్తే విత్తనాలు నాటుదామని రైతుల సిద్ధమయ్యారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు చేసేది లేక ఏర్పాటుచేసిన గట్లను తొలగిస్తున్నారు. వాతావరణ శాఖ నిపుణులు వర్షాలు తక్కువగా ఉన్నాయని పేర్కొనడంతో గట్లను తొలగించాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. అధిక వర్షాల వల్ల పంట చెడిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన రైతులు పేట గట్లపై విత్తనాలు నాటివారు. వర్షాలు లేకపోవడంతో గట్లను తొలగిస్తున్నారు.