15 June, 2026 | 11:46 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటి రెడ్డి

15-07-2024 03:32 PM
నవాబ్ పేట: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సోమవారం పర్యటించారు. నవాబ్ పేట మండల కేంద్రంలోని బిటి డబుల్ రోడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని కోమటి రెడ్డి చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా నవాబ్ పేట నుంచి తిరుమలాపూర్ వరకు బిటి డబుల్ రోడ్డు పనులకు మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, మహబూబ్ నగర్ ఎంపి డికె అరుణ, జడ్చర్ల శాసన సభ్యులు అనిరుధ్ రెడ్డి, దేవరకద్ర శాసన సభ్యులు జి. మధు సూదన్ రెడ్డి పాల్గొన్నారు.