12-11-2025 03:07:33 PM
హైదరాబాద్: నల్గొండ జిల్లా కలెక్టరేట్ లో ఉన్నతాధికారులతో రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వరి, పత్తి కొనుగోళ్లపై, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణంపై, ఆకాల వర్షాలతో పంటలకు జరిగిన నష్టంపై, అలాగే నల్గొండ జిల్లాలో జరుగుతున్నఅభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి చర్చించారు. అలాగే తెలంగాణ జాగృతి ఫ్లెక్సీలను తొలగించినందుకు మున్సిపల్ కమిషనర్ తో పాటు పోలీసుల అధికారులపై సీరియర్ అయ్యారు. ఎవరి రాజకీయాలు వారివి.. ఏదైనా ఉంటే రాజకీయం చూసుకుంటాం. అంతేగాని ఒకరి ప్రచారాన్ని అడ్డుకునే హక్కు మనకు లేదని అధికారులను మంత్రి మందలించారు. మీరు చేసిన తప్పులకు నేను మాటలు పడాల్సి వస్తుందని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.