12-11-2025 06:20:54 PM
హైదరాబాద్: హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలులో ఉద్రిక్తత నెలకొంది. చంచల్ గూడ జైలులో దస్తగిరి, జాఫర్ అనే ఇద్దరు ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఖైదీలుగా ఉన్న ఇద్దరు రౌడీషీటర్లు ఒకరినొకరు కొట్టుకున్నారు. జాఫర్ చేతిని దస్తగిరి మెలిపెట్టి పిడిగుద్దులు గుద్దాడు. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో జాఫర్ ను జైలు అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. తన మీద కూడా దాడి చేశాడని, ట్యూబ్లెట్ లేబుల్ తో దస్తగిరి తన చేతిని తనే కోసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దస్తగిరి రెండు నెలల క్రితం ఎన్బీడబ్ల్యూపై జైలుకు వచ్చాడని, అదేవిధంగా జాఫర్ అక్రమాయుధాల కేసులో నిన్న (మంగళవారం) రిమాండ్ ఖైదీగా వచ్చాడు. దస్తగిరి, జాఫర్ మధ్య పాతకక్షలున్నాయని అధికారులు చెబుతున్నారు.