calender_icon.png 14 January, 2026 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

13-01-2026 11:38:05 PM

పలువురికి ఆర్థిక సాయం అందజేత

అర్మేనియాలో మృతి చెందిన మేకల ప్రవీణ్ మృతదేహం

స్వగ్రామానికి రప్పించేందుకు బరోసా ఇచ్చిన ఎమ్మెల్యే 

బోయినపల్లి,(విజయక్రాంతి): బోయినపల్లి మండలంలో వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం  మంగళవారం రాత్రి పరామర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన మేకల ప్రవీణ్ గత నాలుగు రోజుల క్రితం ఆర్మీనియా దేశంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి  ఆర్థిక సాయం అందజేసి మృతదేహాన్ని త్వరగ స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అలాగే మండల కేంద్రం చెందిన బొడ్డు పరశురాములు గత వారం క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయంని అందజేసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రత్నంపేటలో గ్రామపంచాయతీలో విధులు నిర్వహించిన పంచాయితీ కార్మికుడు ఎదురుగట్ల మల్లయ్య మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. దేశాయిపల్లికి చెందిన మాడిశెట్టి రాయమల్లు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు.

ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి,మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మధుగంటి సురేందర్ రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్, ఏఎంసి వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి,సర్పంచులు నల్లమోహన్, బీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి, కౌడ గాని వెంకటేష్, జంగం అంజయ్య, సుద్దాల మధు,నాయకులు కొలువుల ప్రవీణ్,సంబ లక్ష్మీ రాజం, మెరుపుల జలంధర్, అనంతుల ఆంజనేయులు, నక్క శ్రీకాంత్,తదితరులు ఉన్నారు.