10 June, 2026 | 1:07 AM

దమ్మపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి

10-06-2026 12:04 AM

దమ్మపేట, జూన్ 9 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, దిశా కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రామసహాయం రఘురాం రెడ్డి, అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ దమ్మపేట అశ్వారావుపేట మండలాల్లో మంగళవారం విస్తృతంగా  పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ముందుగా ఆదివాసీ కొండరెడ్డి గిరిజన గ్రామాలైన పూసుగూడెం, కట్కూరులో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం పట్వారిగూడెం నుండి పాకలగూడెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే పట్వారిగూడెంలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం  పట్వరిగుడెం రైతు వేదికలో ఏర్పాటు చేసిన సభలో దమ్మపేట మండలంలోని రాచూరుపల్లి, మల్లారం గ్రామాలకు చెందిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు అర్హత పత్రాలను అందజేశారు.   కొత్తమామిళ్లవారి గూడెం గ్రామానికి చెందిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు అర్హత పత్రాలు అందజేసి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీవో బి.రాహుల్, హౌసింగ్ పి.డి. సవేరాం, డి. ఇ.ఖలీల్, ఏ. ఇ. రాము, దమ్మపేట తాహసిల్దార్ రామ్ నరేష్, ఎంపీడీవో రవీంద్రారెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, అశ్వారావుపేట మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ రమేష్, దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి, పట్వారిగుడెం సర్పంచ్ కూరం అర్జునరావు,  కాంగ్రెస్ నాయకులు పగడాల రాంబాబు, చిన్నశెట్టి యుగంధర్, చిన్నశెట్టి చిట్టిబాబు, జిల్లా, మండల స్థాయి ఉన్నతాధికారులు, జిల్లా, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.