10 June, 2026 | 1:05 AM

‘వీబీ జీ రామ్ జీ’ వాయిదా వేయాలి

10-06-2026 12:05 AM
  1. కేంద్రమంత్రికి తేల్చిచెప్పిన మంత్రి సీతక్క
  2. రాష్ట్రాన్ని సంప్రదించకుండా ప్రారంభించడం సరికాదు
  3. ప్రస్తుత పనుల నిధులను వందశాతం కేంద్రం భరించాలని డిమాండ్

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): ‘వీబీ జీ రామ్- జీ’ పథక అమలును రెండు నెలలైనా వాయిదా వేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. రాష్ట్రాలను సంప్రదించకుండా మరో 20 రోజుల్లో నూతన ఉపాధిహమీ పథకాన్ని ప్రారంభించడం సరికాదని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పనులు పూ ర్తయ్యే వరకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ప్రకారమే వందశాతం నిధులను కేంద్రం భరించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర గ్రామీణా భి టవృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాల అభిప్రాయాలను తెలు సుకున్నారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ జాతీయగ్రామీణ ఉపా ధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వీబీ జీ రామ్‌జీ పథకానికి సం బంధించిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను మంత్రి సీతక్క కేంద్రానికి తెలియజేశారు.

తెలంగాణ ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏలో 12 కోట్ల పనిదినాలు కల్పిస్తుందన్నారు. కొత్తపథకాన్ని జూలై 1నుంచి అమలు చేయాలని నిర్ణయించడం పరిపాలనా, ఆర్థికపరమైన సవాళ్లు ఎదురవుతాయన్నారు. కొత్త విధానానికి మారేందుకు తగిన సమ యం అవసరమన్నారు. తమ రాష్ట్రానికి ప్రస్తుత విధానంలోనే చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ కార్మి కులకు ఉపాధి కల్పించే వెసులుబాటు ఉండాలన్నారు.

ప్రస్తుతం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏలో అమలవుతున్నట్లుగా నైపు ణ్యం లేని కార్మికుల వేతనాలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించడం, మెటీరియల్ వ్యయంలో 75 శాతం కేంద్రం వా టా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. గ్రా మీణ ఉపాధి కల్పన, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పేద కుటుంబాల జీవనోపాధి భద్రత లక్ష్యా లు దెబ్బతినకుండా పథకంలో అవసరమైన మార్పులు, సడలింపులు కల్పించాలని మంత్రి సీతక్క కేంద్రాన్ని కోరారు.

సీతక్క ప్రతిపాదనలకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ మంత్రి సీతక్క చాలా యాక్టివ్ మినిస్టర్ అని ప్రశంసించారు. ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలపై మంత్రి సీతక్కతో ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తామని కేంద్రమంత్రి హమీ ఇచ్చారు.