20 May, 2026 | 5:01 PM

సినీ నటి హేమపై 'మా' సస్పెన్షన్ ఎత్తివేత

23-08-2024 05:24 PM

సినీ నటి హేమపై విధించిన సస్పెన్షన్ ఎత్తి వేస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు మా అధ్యక్షుడు మంచువిష్ణు అదేశాలతో హేమపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది. గత కొన్ని రోజుల కిందట బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో సినీ నటి హేమను అక్కడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని హేమ స్పష్టం చేశారు. హేమపై వచ్చి న ఆరోపణల నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేశారు.