10-02-2026 07:09:46 PM
హైదరాబాద్: రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగే పురపోరులో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించబోతోందని ఆయన ఆశాభవం వ్యక్తి చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ విసిరిన సవాళ్లను గత రెండెండ్లలో అన్ని ఎన్నికల్లో ప్రజలు తిప్పికొట్టారని, రిఫరెండమనే నాయకులు సైలెంట్ అయ్యారు.
అందుకే ఇప్పుడు ఎక్కడ ఏ ప్రచారంలో రిఫరెండం, సెమీఫైనల్స్ అనడం లేదని, కారణం ప్రతిపక్ష నేతలకు ఓటమి భయం పట్టుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతున్నందుకే ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదిస్తున్నారని, ముఖ్యంగా ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందన్న అనుమానం ఉన్నట్లు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే ట్యాపింగ్ కోసం ఎక్కడెక్కడ పరికరాలు అమర్చారో ప్రభుత్వం ఆరా తీస్తోందని, ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, బాధ్యులపై చట్ట పరమైన కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయని హెచ్చరించారు.
మాజీ మంత్రుల అసభ్య పదజాలానికి ప్రజలు ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని, తను సీఎం రేసులో లేను, కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తను.. ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పాను. మళ్ళీ చెబుతున్నాను అని చెప్పారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని ఆయా జిల్లాల ప్రజల నుంచి అనేక విజ్ఞాపనలు వచ్చాయి. ప్రభుత్వం దానిపై ఒక కమిటి వేసి, నివేదికపై అసెంబ్లీలో చర్చ పెడుతాం.
ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు కూడా రావాలి. కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది.. అర్బన్ ప్రాంతాల్లో లేదనే ఊహల్లో ప్రత్యర్థి పార్టీలున్నాయి . మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వారికి తెలుస్తది. గత ఉప ఎన్నికలు, పంచాయితీ ఎన్నికల్లో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కే ప్రజలు పట్టం కడతారనే పూర్తి విశ్వాసం ఉంది.