4 April, 2026 | 1:15 AM

మంత్రి పొంగులేటి ఆదేశం.. పనులు వేగవంతం

04-04-2026 12:00 AM

ఎస్‌ఆర్‌ఎస్పీ పేజ్  2లో కాలువ పనులకు మోక్షం.

కూసుమంచి, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఇటీవలే ఆదేశించారు. ఈ మేరకు స్పందించిన సంబంధిత అధికారులు ఎస్‌ఆర్‌ఎస్పీ పేజ్ -2 లో పెండింగ్ ఉన్న పనులను శుక్రవారం ప్రారంభించారు. ఇటీవలే కూసుమంచి మండలం పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని  నాయకులు, రైతులు కలిసి ఎస్‌ఆర్‌ఎస్పీ పేజ్ -2 పెండింగ్ పనులపై వివరించారు.

కూసుమంచి గ్రామపంచాయతీ పాలేరు చెరువు పక్కనే ఉన్న కూసుమంచి గ్రామంలో చెరువు, కుంటలకు ఎగువ ప్రాంతాల్లో ఉన్న రైతులు ఎన్నో సంవత్సరాలుగా సాగునీరుకు అవస్థలు పడుతూ గతంలో ఎంతోమందికి విన్నవించుకున్న పట్టించుకోని సందర్భాలు లేవన్నారు.

కాలువ పనులు పూర్తి చేస్తే వందల ఎకరాలకు నీళ్ళు వస్తాయని స్థానిక రైతులు మంత్రికి వివరించారు. దీంతో స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తక్షణమే కాలువ నిర్మాణ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. దీంతో అధికారులు కాలువ పనులను ప్రారంభించారు. ఈ పనులను క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పరిశీలించారు. పనులు వేగవంతంగా జరుగుతున్న సందర్భంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి మేము ఎంతో రుణపడి ఉంటామని రైతులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.