4 April, 2026 | 2:45 AM

భట్టి పాదయాత్రకు మూడేళ్లు..

04-04-2026 12:00 AM

కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో సంబరాలు

ఖమ్మం, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సీఎల్పీ లీడర్ గా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పాదయాత్ర శుక్రవారంతో మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సంబరాలు చేశారు.

జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ లు బాలసాని లక్ష్మినారాయణ, పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మాజీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ కేక్ కట్ చేసి భట్టి విక్రమార్కకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర అని కొనియాడారు. పార్టీ కష్టకాలంలో భట్టి విక్రమార్క సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, అదిలాబాద్ జిల్లా, బోథ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామం నుంచి భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టారని తెలిపారు. 

రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చిందన్నారు. అందులో భాగంగానే పాదయాత్ర చేపట్టి మూడెళ్ళు పూర్తి చేసిన సందర్భంగా పిప్పిరిలో బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని అన్నారు. ఈ బహిరంగ సభకు ఖమ్మం జిల్లా నుంచి పార్టీ శ్రేణులు  పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.  కాంగ్రెస్ నాయకులు మహ్మద్ జావేద్, అనుబంధ సంఘ అధ్యక్షులు కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, వేజండ్ల సాయి కుమార్, సయ్యద్ గౌస్, పుచ్చకాయల వీరభద్రం, బొడ్డు బొందయ్య, మొక్క శేఖర్ గౌడ్, డాక్టర్ కాపా మురళి కృష్ణ ,  చోటా బాబా,  మూడుమంతల గంగరాజు తదితర నాయకులు పాల్గొన్నారు.