28 February, 2026 | 2:40 PM

లయన్స్‌క్లబ్‌లో బొమ్మ వెంకటేశ్వర్ బ్లాక్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం

28-02-2026 01:44 AM

కరీంనగర్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బొమ్మ వెంకన్న పేరు మీద ఏర్పాటు చేసిన బ్లాక్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవకు నిదర్శనం లయన్స్ క్లబ్.. ఆనాడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బొమ్మ వెంకన్న దూర దృష్టితో రేకుర్తి లో ఐ హాస్పిటల్ ను ఏర్పాటు చేశారన్నారు.

లక్షల మంది పేదలకు ఉపయోగపడే విధంగా ఈ హాస్పిటల్ సేవలందిస్తుందన్నారు. 1988 నుండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరంతర కార్యక్రమాలు కొనసాగిస్తున్నా రని, ఇప్పటి వరకు 8 లక్షల 52 వేల మందికి ఇక్కడ ఓపీ చికిత్స అందించగా, 1,21,000 మందికి ఫ్రీగా సర్జరీ అందించడం జరిగిందని, 95 వేల మందికి బిపిఎల్ దాటిన వారికి సర్జరీలు జరిగాయన్నారు. 9,000 గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగిందని, లయన్స్ క్లబ్ ను అభినందించారు.

పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నప్పుడు 2010 లో అన్యాక్రాంతమైన స్థలాన్ని అధికారులతో మాట్లాడి నాలుగున్నర ఎకరాలు స్మశాన వాటికకు ఇప్పించామన్నారు. సామాజిక కార్యక్రమాల పట్ల యువత తక్కువ అట్రాక్ట్ అవుతుందని, యువతను సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా, బొమ్మ వెంకన్న సోదరునిగా లయన్స్ క్లబ్ ఏం కోరిన వారికి సేవలు అందిస్తాం...మీకు అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.