calender_icon.png 10 December, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొప్పగా గ్లోబల్ సమ్మిట్ ఫ్యూచర్‌సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

08-12-2025 01:37:10 AM

రంగారెడ్డి ,డిసెంబర్ 7(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం  ప్రపంచ దేశాల తొ పోటీ పడే విదంగా  అభివృద్ధి చేస్తున్నమని బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణ శాఖ మంత్రి పొన్న పొన్నం  ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఆదివారం భారత్ ఫ్యూచర్ సిటీ లో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను వివిధ శాఖల అధికారూలతో కలిసి  మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశిలించారు. ఈ సందర్భంగా  డిజిటల్ టెన్నెల్, సెషన్ హాల్, లను పరిశీలించిన మంత్రి, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచన చేసారు.

అనంతరం అక్కడే కనువిందు చేస్తున్న ఆర్టీసీ లో మొదటి తరం ఆర్టీసీ బస్సు అయినటువంటి అల్బేన్ నుండి ఎలక్ట్రిక్ బస్సు వరకు ఆర్టీసీ అభివృద్ధి అని ప్రదర్శనగా ఉంచిన ఆర్టీసీ బస్సులను మంత్రి ఆసక్తిగా తిలకించారు.గ్లోబల్ సమ్మిట్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ పెరుగుతుందని,  ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయన్న మంత్రి  తేలిపారు. మంత్రి వెంట ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, రావణ శాఖ అధికారులు పాల్గొన్నారు