08-12-2025 01:35:49 AM
రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు
కీసర, డిసెంబర్ 7 (విజయక్రాంతి); ప్రసిద్ధ శైవక్షేత్రమైన కీసరగుట్టలో వెలసిన శ్రీ భవాని సమేత రామలింగేశ్వర స్వామివారిని ఆదివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అభిషేకంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పరమేశ్వరుడు ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను, యాత్రికుల సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. కీసరగుట్ట ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్, పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.