calender_icon.png 2 February, 2026 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేకు భీపారంలు అందజేసిన మంత్రి

02-02-2026 12:58:33 AM

ఇల్లెందు, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్  ఇల్లెందు పురపాలక ఏన్నికల కాంగ్రెస్ పార్టీ భీపారంలు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ఆదివారం  అందజేశారు. ఇల్లందు పురపాలకం కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలపై మంత్రికి ఎమ్మెల్యే వివరించారు. అంతకు ముందు తెలంగాణ రాష్టంలో జరుగుతున్న పురపాలక ఏన్నికలలో భాగంగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ రాష్ట రవాణా, బీసి శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మహబూబాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య కలిశారు.

ఇల్లందు పురపాలక ఏన్నికలపై కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలపై సమిక్ష జరిపి పురపాలక కాంగ్రెస్ పార్టీ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో భీఫారంలను అందుకున్నారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య వెంట ఇల్లందు పురపాలకం మాజీ చైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, బయ్యారం మాజీ సొసైటి చైర్మెన్ మూల మధుకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి భుక్యా ప్రవిణ్ నాయక్, నాయకులు దుడా అర్జున్ రావు తదితరులు పాల్గోన్నారు.