మంకీపాక్స్‌పై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష
19-08-2024 09:53 PM
హైదరాబాద్: మంకీపాక్స్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సమీక్ష నిర్వహించారు. దేశంలో ఢిల్లీ, కేరళ రాష్ట్రాలలో స్వల్పంగా మంకీపాక్స్ కేసులు 15+15(30) నమోదు అయ్యాయని మంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదని అధికారులు పేర్కొన్నారు.
మంకీపాక్స్ నివారణ, చికిత్సకు అవసరమైన చర్యలు చేపట్టాలని, మంకీపాక్స్ పై అప్రమత్తంగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గాంధీ, ఫీవర్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉండాలని రాజనర్సింహ సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంకీపాక్స్ నివారణ మందులు, అవసరమైన కిట్స్ అందుబాటులో ఉంచాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు.






