calender_icon.png 18 February, 2026 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామగుండం అభివృద్ధికి సహకరిస్తా

18-02-2026 09:10:49 PM

నూతన మేయర్ పాలకవర్గానికి మంత్రి శ్రీధర్ బాబు అభినందనలు

రామగుండం,(విజయక్రాంతి): హైదరాబాద్ లోని సచివాలయంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో రామగుండం మున్సిపల్ నూతన మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెళ్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లు మున్సిపల్ శాఖ అధ్యక్షులు బొంతల రాజేష్ లు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి శ్రీధర్ బాబు నూతన పాలకవర్గానికి అభినందనలు తెలియజేశారు. రామగుండం అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే తో పాటు మేయర్, కౌన్సిలర్లు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.‌