1 August, 2026 | 12:34 AM

కూకట్‌పల్లిలో ట్రాఫిక్ కష్టాలు

01-08-2026 12:00 AM
  1. చిన్నపాటి వర్షాలకు ట్రాఫిక్ జామ్ 
  2. రోడ్డుపై నిలుస్తున్న వర్షపు నీరు

కూకట్‌పల్లి, జులై 31,(విజయక్రాంతి ): కూకట్ పల్లి లో ఏ చిన్న పాటి వర్షం వచ్చినా ట్రాఫిక్ జాం ఏర్పడటం సర్వ సాధారణం అయింది.ఏ కొద్ది పాటి వర్షం కురిసిన రోడ్డు పై వర్షపు నీరు నిలిచి ఉండటం తో  ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జాం అవుతోంది. నిత్యం రద్దిగా ఉండే రహదారి కావడం, కూత వేటు దూరంలో హైటెక్ సిటీ ఉండడంతో నిత్యం ఉద్యోగు లు పలు ప్రాంతాల నుంచి కూకట్ పల్లి ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు.

వర్షాలు కురుస్తున్నాయని ఉద్యోగులు ద్విచక్ర వాహనాలను వాడకుండా కార్లను వాడడంతో రోడ్ ల పై వర్షాకాలంలో ట్రాఫిక్ జామ్ లకు మరో కారణం అవుతుంది. కూకట్పల్లిలో గురువారం ఉదయం కురిసిన వర్షానికే కూకట్పల్లి నుండి మూసాపేట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతుండడంతో గంటల తరబడి వాహన దారులు పైన రోడ్ ల పైన ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఉదయం సమయంలో వర్షం పడడంతో పాఠశాలలు, కళాశాలల సమయం కావడం తో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం పడిందంటేనే నిత్యం ప్రయాణించే వాహనదారులు ఈ  దారి గుండా రావడానికి భయపడుతున్నట్లు తెలుస్తుంది.ఈ ట్రాఫిక్ ఇక్కట్లలో అత్యవసర సమయాలలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను అస్పత్రులకు తరలించజడానికి అంబులెన్సు డ్రైవర్ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రోగులను ఆసుపత్రులకు చేర్చడానికి సమయం తక్కువగా ఉండడంతో  అంబులెన్సు లు ట్రాఫిక్ జామ్ లలో ఇరుక్కొని రోగులు ప్రాణాపాయ స్థితిలోకి చేరుకుంటున్నట్టు తెలుస్తుంది. కొందరు మానవతాదృక్పథంతో అంబులెన్సర్ దారి ఇచ్చినప్పటికీ దారి పొడుగున వాహనాలు భారీగా ఉండటంతో ఇబ్బందులు కలుగుతున్నట్లు డ్రైవర్లు వాపోతున్నారు.

ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో భాగంగా జిహెచ్‌ఎంసి సిబ్బంది రోడ్డు పక్కన వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకున్నట్లయితే ట్రాఫిక్ సమస్యను కొంతవరకైనా పరిష్కరించవచ్చని వాహనదారులు వాపోతున్నారు. కూకట్ పల్లి హైటెక్ సిటి ప్రాంతానికి సమీపంలో ఉండటం, గత కొంతకాలం లంగా వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతం కావడం తో పరిసర ప్రాంతాలలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అధికంగా నివసిస్తున్నారు.

కూకట్ పల్లి ప్రాంతం నుండి హైటెక్ సిటీ వైపు నిత్యం వేల సంఖ్యలో వాహనదారులు ప్రయాణిస్స్తుంటారు. ఉదయం హైటెక్ సిటీ వైపు, సాయంత్రం కూకట్పల్లినిత్యం భారీగా ఉద్యోగస్తులు వాహనాలతో ప్రయాణిస్తుంటారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వర్షం పడిందంటే భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది. ట్రాఫిక్ పోలీసులు  ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నప్పటికీ వర్షం పడినప్పుడు ఎక్కువ మంది ఉద్యోగస్తులు కార్ లలోనే ప్రయాణించడానికి ఇష్టపడుతుండటంతో ట్రాఫిక్ జామ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద  ట్రాఫిక్ ను నియంత్రించడంలో భాగంగా అండర్ పాస్ ను నిర్మిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పనులు చేపట్టకపోవడం విచారకరమని వాహనదారులు వాపోతున్నారు. అండర్ పాస్ రోడ్డు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు  పరిష్కారం దొరుకుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.