బెల్లంపల్లి బస్టాండ్లలో భారీ బుంగ కలకలం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నడిబొడ్డున కొత్త బస్టాండ్ లో ఆకస్మికంగా ఏర్పడిన బుంగ పడిన ఘటన కలకలం రేపింది. కొత్త బస్టాండ్ దుకాణం ముందు 15 ఫీట్ల లోతున భూమికి బుంగ ఏర్పడింది. ఈ సంఘటన చూసిన అక్కడి ప్రజలు ఒక్కసారిగా బెంబేలెత్తిపోతున్నారు. ఆ సమయంలో బస్టాండ్ లోఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. బుంగ ఏర్పడటం వల్ల ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్టాండు లో ఏర్పడిన బుంగ కు భూగర్భ గనులే కారణమై ఉంటదని పలువురు భావిస్తున్నారు.
బస్టాండ్ కింది నుంచి 44 ,24, డీప్,సౌత్ క్రాస్ కట్ గనుల బొగ్గు నిక్షేపాల తవ్వకాలు జరిగినట్టు తెలుస్తుంది. వాటి ఫలితంగానే భూమి పూర్తిగా బలహీన పడిందని రిటైర్డ్ కార్మికులు భావిస్తున్నారు. అందువల్లనే భూమికి బుంగ ఏర్పడిందినీ అనుమానిస్తున్నారు. సంఘటన స్థలికి వరకు అధికారులెవరూ వెళ్ళలేదు. భూమీకి పడిన భారీ బుంగ ప్రమాదకరం ఉంది. బుంగ చుట్టూ కంచెఏర్పాటు చేయకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుంగ వల్ల ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. బుంగ ను అధికారులు నిర్లక్ష్యం గా వదిలేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.






